కృష్ణా: యువ పురోహితులు క్రీడల్లో రాణించటం ప్రశంసనీయమని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. బుధవారం అవనిగడ్డలోని తమ కార్యాలయంలో ఉభయ తెలుగు రాష్ట్రాల బ్రాహ్మణ అర్చక పురోహిత క్రికెట్ టోర్నమెంట్ విజేతలు మోపిదేవి మహావీర్ జట్టును ఎమ్మెల్యే అభినందించారు. జట్టు కెప్టెన్ పన్నాల సాయి మహేష్, వేద పండితులు నౌడూరి విశ్వనాధ సుబ్రహ్మణ్య శర్మను సత్కరించారు.