ATP: తెలంగాణ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పరీక్ష ఫలితాల్లో గుత్తికి చెందిన టీడీపీ యువనేత రవితేజ రెండవ కుమారుడు పి.సంజయ్ నాయుడు అత్యంత ప్రతిభ కనబరిచారు. మొత్తం 470 మార్కులకు గాను 465 మార్కులు సాధించి టాపర్గా నిలిచారు. సంజయ్ నాయుడు సాధించిన ఈ విజయంతో తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్థానికులు వారికి శుభాకాంక్షలు తెలిపారు.