విశాఖ: మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు కాన్వాయ్ వాహనం ఢీకొని మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి న్యాయం చేయాలంటూ గతంలో చేపట్టిన ఆందోళనకు సంబంధించిన కేసులో గురువారం విశాఖ జిల్లా కోర్టుకు జనసేన నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా విశాఖ ఉత్తర నియోజకవర్గ ఇంచార్జ్ పసుపులేటి ఉషాకిరణ్, భీమిలి ఇంచార్జ్ పంచకర్ల సందీప్ కోర్టుకు విచ్చేశారు.