SKLM: కార్మికుల హక్కుల కోసం నిరంతరము పోరాటం చేసేది సీఐటీయు అని ఆ సంఘం నాయకులు హనుమంతు ఈశ్వరరావు అన్నారు. ఇవాళ కొత్తూరు మండల కేంద్రంలో రైస్ అండ్ ఆయిల్ మిల్లర్స్ సంఘం కార్మికులు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఇప్పటికే పలు ఉద్యమాలు చేపట్టి కొన్ని హక్కులను సాధించడం జరిగిందన్నారు. విశాఖపట్నంలో జరగబోవు సభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.