కోనసీమ: సఖినేటిపల్లి మండలం గొంది గ్రామంలో ఇటీవల ప్రమాదానికి గురైన స్కూల్ బస్సు ను సీజ్ చేశామని జిల్లా రవాణా అధికారి దేవిశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. లైసెన్స్ లేని క్లీనర్ బస్సు నడపడమే ప్రమాదానికి ప్రధాన కారణమని ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. బస్సు పర్మిట్‌ను నెలరోజులపాటు, డ్రైవర్ లైసెన్స్‌ను మూడు నెలల పాటు రద్దు చేశామన్నారు.