సత్యసాయి: చిలమత్తూరు మండలం దేమకేతిపల్లి ఎస్సీ కాలనీలో ఇవాళ సివిల్ రైట్స్ డే నిర్వహించారు. హిందూపురం రూరల్ సీఐ జనార్ధన్ ప్రజలకు సామాజిక న్యాయం, సమానత్వం, పౌర హక్కులపై అవగాహన కల్పించారు. కాలనీ వాసులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చట్టపరమైన రక్షణలు అందరికీ సమానమని, బాధితులకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.