అనంతపురం: ఉరవకొండ మండలం చిన్న ముష్టూరుకు చెందిన వన్నూరు స్వామి అనే వ్యక్తిని పోక్సో కేసులో అరెస్టు చేసినట్లు సీఐ మహానంది తెలిపారు. ఓ మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి వివాహం చేసుకున్నాడని ఆ బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతనిపై కేసు నమోదు చేశామన్నారు. అతడిని అరెస్టు చేసి కోర్టుకు హాజరు పరిచినట్లు సీఐ తెలిపారు.