తిరుపతిలో గరుడ వారధి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపతి తాతయ్యగుంటకు చెందిన ద్వారక, తిరుచనూర్లో జరిగిన వివాహానికి వెళ్లి వస్తుండగా బ్లిస్ సర్కిల్ వద్ద బైక్ అదుపు తప్పి గరుడ వారధి గోడను ఢీ కొట్టాడు. దీంతో తీవ్రంగా గాయపడిన ద్వారక స్పాట్లోనే మృతి చెందాడు. ఈస్ట్ పోలీస్ స్టేషన్ ఎస్సై హేమాద్రి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.