VSP: పేదరిక నిర్మూలన లక్ష్యంగా అమలవుతున్న పీ-4 కార్యక్రమం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. సీఎం చంద్రబాబు పిలుపుతో 7,539 మంది సమాజ సేవకులు ముందుకు వచ్చి 66,103 కుటుంబాలను దత్తత తీసుకున్నారు. జిల్లాలోని సంస్థలు, వ్యక్తులు కలిసి రూ.77.73 కోట్ల సాయం అందించగా, ఆరోగ్యం, విద్య, మౌలిక వసతుల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారు.