అన్నమయ్య: జిల్లా మదనపల్లిలో అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ వెంకటాద్రి, ఏఆర్ డీఎస్పీ ఏడుకొండల రెడ్డి తదితర పోలీసులు పాల్గొన్నారు.