BPT: చీరాల పట్టణంలో నేతాజీ సేవా సమితి ఆధ్వర్యంలో పేదలకు, రిక్షా కార్మికులకు, భిక్షాటన చేస్తున్న వారికి ప్రతి నెల రెండవ శనివారం అల్పాహారం పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా సామాజిక కార్యకర్త ఆర్కే శీలంను ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన పాల్గొని పేదలకు స్వయంగా అల్పాహారం పంపిణీ చేసి సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.