కోనసీమ: రాష్ట్ర విద్యా శాఖామంత్రి నారా లోకేష్ బాబుకు టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పగించడం టీడీపీ కేడర్‌లో వెయ్యి ఏనుగుల బలాన్ని నింపడమేనని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు బుధవారం రాత్రి అన్నారు. లోకేష్‌కు పార్టీలో నూతన బాధ్యత అప్పగించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. నారా లోకేష్‌కు అభినందనలు తెలియజేశారు.