జగిత్యాల పట్టణంలో కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా ఏర్పాటు చేసిన 150 సీసీ కెమెరాలను కలెక్టర్ సత్య ప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్ ఇవాళ ప్రారంభించారు. నేరాల నియంత్రణ, కేసుల ఛేదనలో సీసీ కెమెరాలు కీలకమని ఎస్పీ తెలిపారు. దొంగతనాలు, గొడవలు, ప్రమాదాల్లో నిందితులను త్వరగా గుర్తించడంలో ఇవి సహాయపడుతున్నాయని చెప్పారు.