ATP: ఎండల తీవ్రత దృష్ట్యా ప్రతి సోమవారం జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) వేళల్లో మార్పులు చేశారు. ఈ మార్పులు ఈ నెల 20 నుంచి అమలులోకి రానున్నాయి. దీని ప్రకారం ఉ.8 నుంచి11 వరకు అర్జీలు స్వీకరిస్తారు. కలెక్టరేట్‌తో పాటు ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయాలు, గ్రామ సచివాలయాల్లోనూ ఇదే సమయం వర్తిస్తుందని కలెక్టర్ ఆనంద్ తెలిపారు.