మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్(రెవెన్యూ)గా రాములు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ కుమార్ దీపక్‌ను కలిసి పూల మొక్క అందజేశారు. 2023-24లో నిర్వహించిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సమయంలో రాములు మంచిర్యాల RDOగా పని చేశారు. అనంతరం హైదరాబాద్‌కు బదిలీపై వెళ్లారు. పదోన్నతి పొంది ఇప్పుడు మళ్లీ మంచిర్యాల అదనపు కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు.