E.G: బివిఎమ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో గత 9 రోజులుగా జరిగిన పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం ప్రశాంతంగా ముగిసిందని డీఈవో కంది వాసుదేవరావు బుధవారం తెలిపారు. 7 జిల్లాల నుంచి 7 సబ్జెక్టులకు సంబంధించిన 1,76,032 పత్రాలు వచ్చాయి. 780 మంది సిబ్బంది విధుల్లో పాల్గొన్నారన్నారు. ఇందులో 75 చీఫ్ ఎగ్జామినర్లు, 455 అసిస్టెంట్ ఎగ్జామినర్లు, 221 సహాయకులు విధులు నిర్వహించినట్లు వెల్లడించారు.