HNK: ఎల్కతుర్తి మండల కేంద్రానికి చెందిన కొమరమ్మ అనే వృద్ధురాలు బుధవారం వ్యవసాయ బావి వద్ద పనిచేస్తుండగా వడదెబ్బకు గురై స్పృహ కోల్పోయింది. ఆసుపత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారు. నిరుపేద రైతు కుటుంబానికి చెందిన ఆమె మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.