VKB: బొంరాస్పేట మండలం మహంతిపూర్ గ్రామానికి చెందిన పలువురు లబ్ధిదారులకు మంజూరైన ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) చెక్కులను బుధవారం కాడ (KADA) ప్రత్యేక అధికారి వెంకట్ రెడ్డి పంపిణీ చేశారు. అనితకు రూ.45 వేలు, నర్సింలు, సురేఖ, సుజాతలకు రూ.50 వేల చొప్పున అందజేశారు. పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించడంలో ఈ నిధులు ఎంతో దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు.