టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ మధ్య ఎక్కువ వినిపిస్తోన్న పేరు శ్రీలీల. తెలుగు తెరకు పరిచయమైన కథానాయికలలో శ్రీలీల కూడా ఒకరు. 2019లో ఈ కన్నడ బ్యూటీ ‘కిస్’ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు పర్యవేక్షణలో వచ్చిన ‘పెళ్లి సందD’తో టాలీవుడ్ లోకి ప్రవేశించింది. ఆ సినిమాలో గ్లామర్ పరంగా శ్రీలీలకు ఎక్కువ మార్కులు పడ్డాయి.
ఆ తర్వాత ఇటీవలె వచ్చిన ‘ధమాకా’ సినిమాలో శ్రీలీల అద్భుతంగా నటించింది. ఈ సినిమాతో ఆమె అద్భుతమైన విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమాతో డ్యాన్సుల పరంగా కూడా ఈ ముద్దుగుమ్మకు మంచి పేరొచ్చింది. ఈ సినిమా తర్వాత ఆమెకు వరుస సినిమాలు క్యూకడుతున్నాయి.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్న సినిమాలో కూడా ఛాన్స్ దక్కించుకుంది. రామ్, బోయపాటి కాంబోలో నటించనుంది. అలాగే వక్కంతం వంశీ ప్రాజెక్టులోనూ నటించే అవకాశాన్ని పొందింది. ఇకపోతే త్రివిక్రమ్, మహేశ్ బాబు కాంబోలోని సినిమాలో కూడా చేయనుంది. ఇలా వరుస సినిమాలో శ్రీలీల బిజీగా ఉంటోంది.
తాజాగా ఈ ముద్దుగుమ్మ తన లేటెస్ట్ పిక్స్ ను సోషల్ మీడియాలో పోస్టు చేసింది. కోలకళ్లతో కొంటె చూపులు విసురుతూ కుర్రాళ్లకు మత్తెక్కిస్తోంది. ప్రస్తుతం ఆమె ఫోటోలు నెట్టింట సందడి చేస్తున్నారు.