బాలీవుడ్(Bollywood)లో కాంట్రవర్షల్ సినిమాల జోరు ఎక్కువవుతోంది. తాజాగా ఆ జాబితాలోకి మరో సినిమా చేరింది. తాజాగా హిందీ సినిమా అయిన ‘యాక్సిడెంట్ ఆర్ కాన్సిపరసీ: గోద్రా’ మూవీ టీజర్ (Godhra Movie Teaser Release)ను మేకర్స్ రిలీజ్ చేశారు. గత ఏడాది ‘ది కశ్మీరీ ఫైల్స్'(The Kashmiri Files) విడుదలై సంచలనం రేకెత్తించింది. 1990లలో కశ్మీరీ పండితుల ఊచకోతపై ఈ మూవీ తెరకెక్కింది. అలాగే ఈ మధ్యనే ‘ది కేరళ స్టోరీ’ మూవీ(The Kerala Story) విడుదలై పలు వివాదాలకు దారి తీసింది. ఈ సినిమా నిర్మాతలకు కలెక్షన్ల వర్షం కురిపించింది.
‘గోద్రా’ టీజర్ :
2002లో గోద్రా(Godhra)లో జరిగిన రైలు దగ్ధం, అల్లర్ల ఘటనలపై ఇప్పుడు ‘యాక్సిడెంట్ ఆర్ కాన్సిపరసీ: గోద్రా’ మూవీ(Godhra Movie) రూపొందుతోంది. తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ రిలీజ్(Teaser Release) చేశారు. ఈ సినిమాకు ఎం.కె.శివాక్ష్ దర్శకత్వం వహిస్తున్నారు. బీజే పురోహిత్, రామ్ కుమార్ పాల్ ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
గోద్రా(Godhra) ఘటన నిజంగానే ప్రమాదమా లేక కుట్రతో జరిగిందా అనే కోణంలో మూవీ తెరకెక్కుతోంది. 2002లో అయోధ్యకు వెళ్లి వస్తున్న 59 మంది కరసేవకులు దుర్మరణం చెందారు. గుజరాత్ మతకల్లోహాల మధ్య గోద్రా రైలు దగ్ధం(Godhra train Accident Incident) అయ్యింది. ఆ ఘటన వెనక అసలు సూత్రధారి ఎవరు? ఆ రోజు ఏం జరిగిందో, అల్లర్లకు కారణాలేంటి? అనే కోణంలో సినిమాను రూపొందిస్తున్నారు.