MHBD: ‘గ్రామాల్లో అంగన్వాడీ కోడిగుడ్ల విక్రయం’ అనే శీర్షికతో HIT TVలో కథనం ప్రచురితమైంది. ఈ కథనానికి స్పందించిన సీడీపీఓ కమలదేవి, సూపర్వైజర్లు మల్లీశ్వరి, సరితలు ఇనుగుర్తి పోలీస్ స్టేషన్లో ఉన్న వాహనంలోని కోడిగుడ్లను పరిశీలించారు. కోడిగుడ్లు మహబూబాబాద్ జిల్లాకు చెందినవి కావని, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాకు సంబంధించిన ముద్ర వేసి ఉన్నట్లు గుర్తించారు.