W.G: ఆచంట మండలం వల్లూరు ఎస్సీ బాలికల వసతి గృహాన్ని జాయింట్ ఇన్స్పెక్షన్ కమిటీ అధికారులు మంగళవారం సాయంత్రం తనిఖీ చేశారు. వసతి గృహంలో అందుతున్న సౌకర్యాల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పడుకోవడానికి బెడ్లు లేక ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని అన్నారు.