PDPL: జిల్లా వ్యాప్తంగా 6వ రోజు ఇవాళ నిర్వహించిన టెన్త్ క్లాస్ బయాలజికల్ సైన్స్ పరీక్ష ప్రశాంతంగా జరిగినట్లు DEO శారద ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 7495 మందికి 7485 మంది విద్యార్థులు హాజరుకాగా, 10మంది గైర్హాజరయ్యారని తెలిపారు. మొత్తం మీద 99.9% హాజరు నమోదైనట్లు వెల్లడించారు. మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని ఆమె పేర్కొన్నారు.