KNR: చిగురుమామిడి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో సర్వసభ్య సమావేశం పర్సన్ ఇంఛార్జ్ వనజ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం సీఈవో నర్సయ్య సంఘం లావా దేవిలను చదివి వినిపించారు. అనంతరం పర్సన్ ఇంఛార్జ్ మాట్లాడుతూ.. రైతుల సహకారంతోనే సహకార సంఘాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం పరిధిలోని రైతులు పాల్గొన్నారు.