బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్, దర్శకుడు వంశీ పైడిపల్లి కాంబోలో క్రేజీ ప్రాజెక్టు రాబోతుంది. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ ఫిక్స్ అయింది. ఇందులో స్టార్ హీరోయిన్ నయనతార కథానాయికగా నటించనున్నట్లు తెలుపుతూ మేకర్స్ పోస్టర్ చేశారు. దిల్ రాజు ప్రొడక్షన్లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై రాబోతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ 2026 నుంచి ప్రారంభం కానుంది.