BDK: తెలంగాణ రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా జిల్లాలో పోలీస్ సిబ్బంది ముమ్మరంగా రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తున్నారు. నేటి హడావిడి జీవితాల్లో సరైన రోడ్డు నియమాలు పాటించక అనేకమంది వాహనదారులు ప్రాణాలు కోల్పోతున్నారు. సరైన రోడ్డు భద్రత నియమాలు పాటించి క్షేమంగా ఇంటికి చేరాలని పోలీసులు కోరుతున్నారు.