NDL: ఉమ్మడి కర్నూలు జిల్లాకు 22 కోర్టులు మంజూరు కాగా, నంద్యాలకు 4కోర్టులు కేటాయించారు. ఈ సందర్భంగా న్యాయశాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్‌ను జిల్లా బార్ అసోసియేషన్ సన్మానించింది. కొత్త కోర్టులతో కేసులు పరిష్కారం వేగవంతం అవుతుందని న్యాయవాదులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు హుస్సేన్ భాష, ఉపాధ్యక్షుడు సుబ్బారాయుడు, న్యాయవాదులు పాల్గొన్నారు.