ATP: కళ్యాణదుర్గం ప్రాంతంలో కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసి ప్రతి ఇంటిని బంగారు కుటుంబంగా తీర్చిదిద్దుతామని MLA అమిలినేని సురేంద్ర బాబు తెలిపారు. పీ4 ద్వారా పేదరికం లేని సమాజం కోసం CM చంద్రబాబు విజన్ 2047తో ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు. తిమ్మసముద్రం ఏపీఐఐసీ భూముల్లో చిన్న పరిశ్రమల స్థాపనకు ఆసక్తి ఉన్న వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.