»Rashi Khanna When Did You Take A Bath But Want Allu Arjun And Mahesh Babu
Rashi Khanna: అసలెప్పుడు స్నానం చేశావ్? కానీ అల్లు అర్జున్, మహేష్ బాబు కావాలట?
క్యూట్ అండ్ హాట్ బ్యూటీ రాశి ఖన్నాకు షాక్ ఇచ్చాడు ఓ హీరో. చివరిగా ఎప్పుడు స్నానం చేశావ్? అంటూ రాశీ ఖన్నాను సూటిగా అడిగేశాడు. కానీ రాశిఖన్నా మాత్రం తనకు అల్లు అర్జున్, మహేష్ బాబు కావాలంటూ చెప్పుకొచ్చింది.
Rashi Khanna When did you take a bath? But want Allu Arjun and Mahesh Babu?
Rashi Khanna: కెరీర్ స్టార్టింగ్‌లో చాలా క్యూట్‌గా ఉండే రాశి ఖన్నా.. ఇప్పుడు గ్లామర్ డోస్ పెంచేసింది. అమ్మడిని చూస్తే అసలు ఈమె రాశినేనా? అనేలా రెచ్చిపోతోంది. కొన్నాళ్ల క్రితం టాప్ హీరోయిన్లలో ఒకరుగా ఉన్న రాశి.. ఇప్పుడు కెరీర్ ఫేడవుట్ స్టేజ్‌లో ఉంది. అందుకే.. ఎలాగైనా సరే మేకర్స్ దృష్టిలో పడేందుకు కాస్త గట్టిగానే అందాల విందు చేస్తోంది. బాలీవుడ్ పై కూడా ఫోకస్ చేస్తోంది. ఆఫర్ల కోసం టెంప్ట్ చేసేందుకు రాశిఖన్నా సోషల్ మీడియాలో షేర్ చేసే ఫోటోలు.. మామూలుగా ఉండడం లేదు. ఈ మధ్య అమ్మడు చాలా స్లిమ్‌గా కనిపిస్తూ.. ఎద అందాలు, థై షో చేస్తోంది. లేటెస్ట్గా షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. బ్లూ కలర్ జాకెట్ విప్పేసి మరీ స్కిన్ షో చేసింది. దీంతో మరోసారి రాశి ఖన్నా హాట్ టాపిక్ అయింది.
అయితే.. ఈ ఫొటోషూట్ అనంతరం అమ్మడు ఇన్ స్టా వేదికగా తన అభిమానులతో ముచ్చటించింది. ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు సరదా సరదా సమాధానం ఇచ్చింది. ఏ హీరోతో నటించాలని ఉందని అడగ్గా.. తెలుగులో అల్లు అర్జున్, మహేష్ బాబుతో పాటు దళపతి విజయ్, షారుఖ్ ఖాన్, హృతిక్ రోషన్ తనకు నచ్చిన హీరోలంటూ చెప్పుకొచ్చింది. అయితే.. ఇదే సమయంలో రీసెంట్గా వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ 12th ఫెయిల్ హీరో విక్రాంత్ మెస్సీ కూడా రాశీ ఖన్నాతో ముచ్చటించాడు. ఎవ్వరు ఊహించని విధంగా చివరగా ఎప్పుడు స్నానం చేశావ్? అని అడిగి షాక్ ఇచ్చాడు. దీనిపై రాశి ఫన్నీగా స్పందించింది. మార్నింగ్ చేశాను.. మళ్లీ సాయంత్రం కూడా స్నానం చేస్తాను అంటూ నవ్వేసింది. ఏదేమైనా.. మనోడికి రాశిఖన్న స్నానం చేసిందా? లేదా? అనే డౌట్ ఎందుకొచ్చిందో?