TG: మాజీ మావోయిస్టు వసంత అలియాస్ మమత.. ఇవాళ జగిత్యాల జిల్లా కలెక్టర్‌ను కలిశారు. తనకు రావాల్సిన ప్రభుత్వ రివార్డులు, పెన్షన్, నివాసం కోసం ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించారు. కాగా, 2000లో తన భర్త పసుల రాంరెడ్డి మరణించిన తర్వాత కూడా ఆమె మావోయిస్టు పార్టీలోనే కొనసాగి.. 2025 జనవరిలో ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వానికి లొంగిపోయారు.