సత్యసాయి: పెనుకొండ మండలం పులేకమ్మ గుడి సమీపంలో ఇవాళ రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ఒక కారు రోడ్డుపైకి వచ్చిన ఆవును ఢీకొట్టడంతో ఆవు అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనతో ఒక్కసారిగా వాహనాలు ఆగిపోవడంతో మరో రెండు కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయని స్థానికులు చెప్పారు. అయితే ఈ ఘటనలో పెద్ద ప్రమాదం తప్పినట్లు తెలిపారు. సంఘటనతో ఆ ప్రాంతంలో కొంతసేపు ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది.