NLR: మహానంది మండలం తిమ్మాపురం ఆదర్శ పాఠశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతున్నట్లు ప్రిన్సిపల్ లక్ష్మణ్ రావు తెలిపారు. ఎంపీసీ, బైపీసీ, సీఈసీ గ్రూపుల్లో ఇంగ్లీష్ మీడియంలో చేరాలనుకునే వారు ఏప్రిల్ 30లోపు దరఖాస్తు చేయాలి. మే 5న ఎంపిక జాబితా విడుదల చేసి, 6న సర్టిఫికెట్ పరిశీలన నిర్వహిస్తారు.