ASR: కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త 2.5 లక్షల ఇళ్ల పంపిణీలో భాగంగా పాడేరులో సామూహిక గృహప్రవేశాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సంధ్యారాణి, జీసీసీ ఛైర్మన్ కిడారి శ్రవణ్, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, కలెక్టర్ దినేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పేదలకు ఇంటి తాళాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.