ఛలో మూలపేటకు వైసీపీ శ్రేణులు తరలి వెళ్లారు. విశాఖ జిల్లా అధ్యక్షుడు కె.కె.రాజు ఆధ్వర్యంలో సోమవారం పార్టీ కార్యాలయం నుంచి మూలపేట పోర్టు వైపు ర్యాలీగా బయలుదేరారు. ఈ కార్యక్రమంలో సమన్వయకర్తలు మళ్ళ విజయప్రసాద్, తిప్పల దేవన్ రెడ్డి, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, జడ్పీ ఛైర్పర్సన్ సుభద్ర, మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు, తదితరులు పాల్గొన్నారు.