టాలీవుడ్ సినీయర్ నటుడు నరేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన మూడో భార్య రమ్య రఘుపతి నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ ఆయన కోర్టును ఆశ్రయించారు. సుపారీ గ్యాంగ్‌తో కలిసి తనను అంతం చేయడానికి రమ్య రఘుపతి ప్రయత్నిస్తోందని ఆరోపణలు చేశారు. వెంటనే రూ.10 కోట్లు తనకు ఇవ్వాలని రమ్య తనను బెదిరించినట్లు తెలిపారు. తాను అంత డబ్బు ఇవ్వనని అన్నందుకు సుపారీ గ్యాంగ్‌తో కలిసి తన హత్యకు కుట్ర పన్నిందన్నారు.
తనను చంపేందుకు గతేడాది కొందరు రెక్కీ కూడా నిర్వహించినట్లు నరేష్ తెలిపారు. దీంతో ఆమె నుంచి తనకు ప్రాణహాని ఉందని, ఇప్పటికే కోర్టును ఆశ్రయించానన్నారు. తన మూడో భార్య రమ్య రఘుపతి వల్ల తాను నరకయాతన అనుభవిస్తున్నట్టు నరేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె తన ఫోన్‌ను హ్యాక్ చేశారని, అందుకే తాను సైబర్ కోర్టులోనూ కేసు వేసినట్లు తెలిపారు. గత కొన్ని రోజుల నుంచి తన మూడో భార్యపై పలు వ్యాఖ్యలుచేస్తూ నరేష్ వార్తల్లో నిలుస్తున్నాడు. తాజాగా తనకు తన మూడో భార్య నుంచి ప్రాణహాని ఉందని ఆరోపణలు చేశారు. ప్రస్తుతం దానికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.