W.G: అసెంబ్లీ సమావేశాల్లో సోమవారం పాలకొల్లు ఎమ్మెల్యే, మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని యనమదురు డ్రైన్ ముంపు సమస్యను ఆయన ప్రస్తావించారు. వర్షాకాలం నేపథ్యంలో అధికంగా వరదలు రావడం వల్ల సమీపంలోని పంట పొలాలు నీట మునిగే పరిస్థితి ఉందని పేర్కొన్నారు. దీనికోసం కూటమి ప్రభుత్వం నిధులు సమకూర్చడం జరిగిందన్నారు.