విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ ‘రణబాలి’. తాజాగా ఈ మూవీ కొత్త షెడ్యూల్ అనంతపురంలో ప్రారంభమైంది. ఏప్రిల్ మొదటి వారం వరకు ఇక్కడ కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఈ షెడ్యూల్లో విజయ్, రష్మిక పాల్గొంటున్నారు. ఇక ఈ చిత్రం సెప్టెంబర్ 11, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.