కృష్ణా: పట్టణంలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా పెడన పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్సై-2 సోమవారం బస్టాండ్ సెంటర్ వద్ద ఆటో డ్రైవర్లతో కౌన్సెలింగ్ నిర్వహించారు. రోడ్లపై ఆటోలను అడ్డంగా నిలిపివేయడం వల్ల ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడుతున్నాయని తెలిపారు. ప్రయాణికులను ఎక్కించడం, దింపడం కోసం నిర్ణయించిన ప్రదేశాలనే ఉపయోగించాలని డ్రైవర్లకు సూచించారు.