WNP: పాన్గల్ ఆగ్రో రైతు సేవ కేంద్రం వద్ద 300 బస్తాల యూరియా పంపిణీకి సిద్ధంగా ఉందని కార్యదర్శి భాస్కర్ గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు. రైతులు గురువారం ఉదయం 9:30 గంటల నుంచి బుకింగ్ యాప్ ద్వారా తమ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. యాప్లో ముందస్తుగా బుక్ చేసుకున్న రైతులకు మాత్రమే కేంద్రం వద్ద యూరియా అందజేయడం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు.