మలయాళ నటుడు మోహన్ లాల్ తన వ్యక్తిత్వ హక్కుల రక్షణ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన పేరు, గొంతు, ఫొటోలు, సంతకం లేదా హావభావాలను అనుమతి లేకుండా వాణిజ్యపరంగా వాడకూడదని కోరారు. ముఖ్యంగా AI డీప్‌ఫేక్స్, వాయిస్ మిమిక్రీ ద్వారా జరిగే దుష్ప్రచారాన్ని అడ్డుకోవాలని, తన బ్రాండ్ విలువను కాపాడాలని ఆయన పిటిషన్లో విజ్ఞప్తి చేశారు.