సత్యసాయి: కదిరి పట్టణంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని కలెక్టర్ శ్యాంప్రసాద్ మంగళవారం తనిఖీ చేశారు. రికార్డులు, రిజిస్ట్రేషన్ ప్రక్రియను పరిశీలించారు. కార్యాలయానికి వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సేవలు అందించాలని, పనుల్లో పారదర్శకత పాటించాలని సిబ్బందికి సూచించారు. పెండింగ్ దస్త్రాలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.