VSP: రంజాన్ సందర్భంగా ప్రభుత్వం మార్చి 21ని సెలవుగా ప్రకటించడంతో, ఆ రోజున నిర్వహించాల్సిన టెన్త్ తరగతి ఇంగ్లిష్ పరీక్షను వాయిదా వేసినట్లు డీఈవో ప్రేమ్ కుమార్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. వాయిదా పడిన ఇంగ్లిష్ పరీక్షను ఏప్రిల్ 2న నిర్వహించనున్నట్లు వెల్లడించారు.