బాపట్ల: పర్చూరు మండలం పోతుకట్ల గ్రామానికి చెందిన యలవదల రజినికి అత్యవసర వైద్య చికిత్స కోసం ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.6,00,000 ఎల్ఓసీ చెక్ మంజూరైంది. ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు సిఫారసుతో ఈ చెక్‌ను టీడీపీ సీనియర్ నేత మానం హరిబాబు, పార్టీ నాయకులు కలిసి అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. పేదలకు అండగా సీఎం రిలీఫ్ ఉంటుందన్నారు.