PPM: బలిజిపేట మండలం శివరాంపురం పంచాయతి చెల్లింపేట బీసీ కాలనీలో రహదారి సౌకర్యం లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కాలువలు నిర్మించినప్పటికీ సీసీ రోడ్డు వేయకపోవడంతో వర్షం పడితే నీరు నిలిచిపోయి బురదలో నడవడం కష్టంగా మారిందని స్థానికులు తెలిపారు. అధికారులు స్పందించి సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టాలని స్ధానికులు కోరుతున్నారు.