KRNL: దేవనకొండ మండల వ్యాప్తంగా జియో నెట్వర్క్ సంబంధించి సేవలు పూర్తిగా రావడంలేదని పలువురు జియో కస్టమర్లు వాపోతున్నారు. దీనికి సంబంధించి జియో కేర్‌ను వివరణ అడగగా సెల్ టవర్ దగ్గర కోతులు కేబుల్ పూర్తిగా నాశనం చేశాయని, దానికి సంబంధించి రిపేరు జరుగుతుందన్నారు. ఎంత సమయం పడుతుందో తెలియదని జియో సంబంధిత వర్కర్స్ పేర్కొన్నట్లు సమాచారం.