తిరుపతి జిల్లాలో కిరణ్ కుమార్ అలియాస్ అగ్గిపెట్టె మచ్చ అదృశ్యం అయ్యాడు. చిగురువాడ పంచాయతీ కొత్తూరు YSR కాలనీకి చెందిన కిరణ్ ఈనెల 16 నుంచి కనిపించడం లేదని అతని అక్క సుజాత తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఒక ఫోన్ కాల్ రావడంతో బయటకు వెళ్లిన కిరణ్,ఆ తర్వాత తిరిగి రాలేదని పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.