AKP: సీఎం చంద్రబాబు ఈనెల 23న నక్కపల్లిలో పర్యటించనున్నట్లు ఎస్ రాయవరం మండల టీడీపీ అధ్యక్షుడు అమలకంటి అబద్ధం తెలిపారు. సీఎం పర్యటనకు జన సమీకరణపై బుధవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో అధికారులు, ప్రజాప్రతినిధులు నాయకుల సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. మండలం నుంచి సీఎం పర్యటనకు వచ్చే వారి కోసం 40 బస్సులు ఏర్పాటు చేస్తున్నామన్నారు.