Revanth Reddy: ఇటీవల కాంగ్రెస్ పార్టీ ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ప్రకటించింది. తమ పార్టీ అధికారంలోకి వస్తే ఆ సామాజిక వర్గాలకు చేయబోయే కార్యక్రమాల గురించి టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రకటించారు. చేవెళ్లలో జరిగిన కార్యక్రమానికి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ వేదికపై రేవంత్ మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు చదువుకోవాలని.. అలా వారిని ఉత్సాహ పరుస్తూ విద్యా జ్యోతుల పథకం కింద నగదు ప్రకటించారు.
ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు పదో తరగతి పాసయితే చాలు రూ.10 వేల నగదు అందజేస్తామని రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రకటించారు. గ్రాడ్యుయేషన్ చేస్తే రూ.25 వేల నగదు ఇస్తామని.. పీసీ చేస్తే రూ.1 లక్ష అందజేస్తామని తెలిపారు. ఎంఫిల్, పీహెచ్డీ చేస్తే రూ.5 లక్షలు ఇస్తాం అని ప్రకటించారు. విద్యార్థులు చదువు పూర్తయితే ప్రోత్సాహకం అందజేస్తామని.. చక్కగా చదువుకొని, ప్రయోజకులు కావాలని సూచించారు.
ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు అందజేసే నగదు ఒకసారే ఇస్తారా..? లేదంటే నెల నెల ఇస్తారనే దానిపై క్లారిటీ లేదు. అలాగే విద్యార్థులకేనా..? చదువు ఆపేసి.. తిరిగి చదువుకునే వారికి కూడా ఇస్తారనే అంశంపై స్పష్టత లేదు. కానీ దళిత, గిరిజనులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ.. మరీ ఓటు బ్యాంక్‌గా మారతారో లేదో చూడాలి.
ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 10 పాసైతే రూ.10 వేల నగదు గ్రాడ్యుయేషన్ చేస్తే రూ.25 వేలు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తే రూ.లక్ష పీహెచ్డీ చేస్తే రూ.5 లక్షలు ఇస్తాం – రేవంత్ రెడ్డి pic.twitter.com/4TmjDfNlGU
తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికల సమయం దగ్గరపడింది. బీఆర్ఎస్ అభ్యర్థులను కూడా ప్రకటించింది. మిగతా పార్టీలు క్యాండెట్స్ ఎంపికపై కసరత్తు చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్లు ప్రకటిస్తూ.. జనాలను ఆకట్టుకునే పనిలో నిమగ్నమైంది. రేవంత్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. నిజంగా ఇంత మొత్తం ఇస్తారా..? లేదంటే ఆకట్టుకోవడమేనా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.