TG: రాష్ట్రప్రభుత్వం అంగన్వాడీ సిబ్బందికి శాంసంగ్ గెలాక్సీ A06 మోడల్ ఫోన్లను పంపిణీ చేస్తోంది. అయితే ఈ ఫోన్ ధర మార్కెట్లో రూ. 8,250 ఉంటే.. ప్రభుత్వం ఒక్కో ఫోన్ను రూ.11,650 పెట్టి కొనుగోలు చేసిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీనివల్ల సుమారు రూ.30 కోట్ల కుంభకోణం జరిగిందని విమర్శిస్తున్నాయి. అయితే ఓపెన్ టెండర్ల ద్వారానే వీటిని కొనుగోలు చేశామని సీతక్క చెబుతున్నారు.