JN: పాలకుర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఇవాళ జరిగిన మహాత్మా జ్యోతిబాపూలే వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి పాల్గొని పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జ్యోతిబాపూలే వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి చేసిన సేవలు దేశానికి మార్గదర్శకంగా నిలిచాయని అన్నారు.